ఇవాలనే సద్దుల బతుకమ్మ

హైదరాబాద్‌: బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది.

ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ మహా ఊరేగింపు కార్యక్రమం ఇవాళ(బుధవారం) సాయంత్రం 4 గంటలకు ట్యాంక్‌బండ్‌ నుంచి ప్రారంభమవుతుంది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు పాటలు పాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగతుంది ఈ బతుకమ్మ పండగ. 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆ సద్దుల బతుకమ్మను ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతా ఘనంగా జరుపుకుంటుంది.

సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేకంగా ఫైర్‌ వర్క్స్, లేజర్‌ షో ఏర్పాటు చేశామన్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ. వెయ్యి మంది తెలంగాణ జానపద కళాకారులు, 100 మంది విదేశీ కళాకారులతో సాంస్కృతిక యాత్రతో పాటు బతుకమ్మల ప్రత్యేక ఊరేగింపు ఉంటుందన్నారు ఆయన. రేపు(గురువారం)  సాయంత్రం 6 గంటలకు గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు హరికృష్ణ.

Posted in Uncategorized

Latest Updates