ఇవాల్టి నుంచే నాలుగో విడత హరితహారం

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నాలుగో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. గజ్వేల్ నియోజకవర్గం ములుగు దగ్గరలో రాజీవ్ రహదారిపై ఒకచోట, గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు సీఎం కేసీఆర్.  ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో ఒకటి, పట్టణంలో ఇందిరా చౌక్  దగ్గర మరో మొక్కను నాటుతారు.  గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇంట్లో,  అన్ని రకాల రోడ్లపైనా, ఔటర్ రింగ్ రోడ్డు పైనా, ప్రభుత్వ-ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. ఉదయం అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగించగానే ప్రజలంతా ఒకేసారి లక్షా 16 వేల మొక్కలను  నాటేలా ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates