ఇవాళే JEE మెయిన్‌ ఎగ్జామ్ 

JEEకేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎక్జామినేషన్‌ (JEE) మెయిన్‌ రాత పరీక్ష ఆదివారం(ఏప్రిల్-8) జరగనుంది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం ఉదయం 9:30 గంటల నుంచి పేపరు-1, బీఆర్క్‌/బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి పేపరు-2 పరీక్షలు జరుగనున్నాయి.

ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 74,580 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 115 సెంటర్ల లోపరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Posted in Uncategorized

Latest Updates