ఇవాళ్టి నుంచి బీజేపీ బస్సు యాత్ర

bjp-bus-yatraరాష్ట్రంలో ఇవాళ్టి( శనివారం,జూన్-23) నుంచి బస్సుయాత్ర నిర్వహించేందుకు  రెడీ అయ్యింది. బీజేపీ. ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలను జనానికి వివరిస్తామంటున్నారు లక్ష్మణ్. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత యాదాద్రికి చేరుకుంటారు. అక్కడ పూజల తర్వాత సాయంత్రం భువనగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం కోసం మోడీ, అమిత్ షా ఉపయోగించిన బస్సులోనే యాత్రకు వెళ్తున్నారు నేతలు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ యాత్రను ప్రారంభించనున్నారు. ఇవాళ మొదలుకానున్న యాత్ర జులై  6 వరకు జరగనుంది. 14 రోజుల పాటు జరిగే ఈ యాత్ర… ప్రతీరోజు రెండు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రెడీ చేశారు ఆ పార్టీ నేతలు.

Posted in Uncategorized

Latest Updates