ఇవాళ్టి నుంచి రామ రాజ్య రథయాత్ర : రూట్ మ్యాప్ ఇదే

ayodya0213రామజన్మభూమి-బాబ్రి మసీదు కేసు ఫైనల్ హియరింగ్ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు త్వరలో తీర్పు ఇవ్వబోతోంది. ఈ లోపే విశ్వహిందూ పరిషత్ రామ రాజ్యరథయాత్రను చేపట్టింది. ఈ యాత్ర మంగళవారం (ఫిబ్రవరి-13) సాయంత్రం కర్ సేవక్ పురం నుంచి మొదలవుతుంది. రామ రాజ్య రథయాత్ర రెండు నెలల పాటు ఆరు రాష్ట్రాల మీదుగా జరుగుతుంది. తమిళనాడు రామేశ్వరంలో ముగుస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు అధికారంలోకి రావాలనుకుంటున్న కర్నాటక, కేరళ, తమిళనాడు మీదుగా రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. 1990ల్లో ఎల్కే ఆద్వానీ రామమందిర నిర్మాణం కోరుతూ దేశవ్యాప్తంగా రథయాత్ర చేశారు. అప్పట్లో కొన్ని రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రామ రాజ్య రథయాత్రను కేరళ వ్యతిరేకించింది.

Posted in Uncategorized

Latest Updates