ఇవాళ్టి నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ

యాసంగి సీజన్ కు రైతు బంధు చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి(అక్టోబర్.5) నుంచి చెక్కులను రైతులకు అందించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. మొత్తం 568 మండలాలకు సంబంధించి తొమ్మిది బ్యాంకులు చెక్కులను ప్రింట్ చేశాయి. వీటిలో 18 జిల్లాల్లో 110 మండలాల పరిధిలో పంపిణీకి అవసరమైన చెక్కులు సిద్ధమయ్యాయి.

110 మండలాలకు సంబంధించి ముద్రించిన 11లక్షల చెక్కులను ఆంధ్రాబ్యాంకు, టీఎస్‌కాబ్, ఏపీజీవీబీ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వానికి అందచేశారు. దీంతో చెక్కుల పంపిణీని ఇవాళ్టి నుంచి రైతులకు అధికారులే అందజేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారథి మార్గదర్శకాలు జారీచేశారు. వానకాలం రైతుబం ధు చెక్కుల పంపిణీ సందర్భంగా ఆర్బీఐ సహకారంతో బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది.. అసెంబ్లీ రద్దవడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు లేవు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates