ఇవాళ్టి నుంచి CPM జాతీయ మహాసభలు

CPM SABHAభారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు బుధవారం (ఏప్రిల్-18) నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ RTC కల్యాణ మండలం వేదికగా జరిగే ఈ ఐదు రోజుల సభల్లో పార్టీ పటిష్టత, రాజకీయ విధానాలపై చర్చించి భావి కార్యాచరణ రూపొందించనున్నారు.
షెడ్యూల్‌ ఇదే….
వరుసగా రెండోసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న CPM జాతీయ మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

బుధవారం ఉదయం పదింటికి RTC కల్యాణమండపంలో మహ్మద్‌ అమీన్‌ నగర్ ప్రాంగణంలో పార్టీ పతాకావిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏచూరి సందేశం, CPI, CPI(ML,) ఫార్వర్డ్‌బ్లాక్, RSP, SUCI (C) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి.  19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు.

అదే రోజు మలక్‌ పేట టీవీ టవర్‌ నుంచి సభ జరిగే సరూర్‌నగర్‌ స్టేడియం వరకు 20 వేల మంది రెడ్‌ షర్ట్‌ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే RTC కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. మహాసభల్లో 25 అంశాలపై తీర్మానాలుంటాయని తెలిపాయి పార్టీ వర్గాలు.

Posted in Uncategorized

Latest Updates