ఇవాళ్టి నుంచి H-1B వీసా దరఖాస్తులు షురూ

h-1bవలస చట్టంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మొదటిసారి H-1B వీసా దరఖాస్తు దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం( ఏప్రిల్-2) నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్ షిప్  అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) దరఖాస్తులను స్వీకరించనుంది. మొత్తం 65,000 మందికి H-1B వీసా ఇవ్వాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మరో 20,000 మంది విదేశీయులకు అవకాశాన్ని కల్పించనుంది. దరఖాస్తుదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ప్రక్రియ అక్టోబరు 1న ప్రారంభం కానుంది. ఒక అభ్యర్థి నుంచి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులొస్తే వాటిని తిరస్కరిస్తారు.

ఈ క్రమంలో దరఖాస్తులో చిన్న చిన్న తప్పిదాలను కూడా సహించేది లేదని USCIS హెచ్చరించింది. ఇమ్మిగ్రేషన్‌ అటార్నీలు ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరిస్తారనే చర్చలు సోషల్ మీడియా వేదికపై జోరుగా సాగుతున్నాయి. డూప్లికేట్‌ దరఖాస్తులను తిరస్కరిస్తామని కూడా USCIS హెచ్చరించింది. కంపెనీలు ఏళ్ల పర్యంతం డూపిక్లేట్‌ దరఖాస్తులను దాఖలు చేయడం ఒక ఆనవాయితీగా మారింది. దరఖాస్తులపై లాటరీ తీసినప్పుడు అలాంటి దరఖాస్తుదారుల లబ్దిదారులకు వీసా సునాయాసంగా లభించేది. ఫారమ్‌లో అన్ని సెక్షన్లను సరిగ్గా పూర్తి చేయాల్సి ఉంటుందని  సూచించింది. దరఖాస్తుదారు లబ్దిదారుని పాస్‌పోర్ట్‌ కాపీని కూడా సమర్పించాలి అని తెలిపింది. ప్రస్తుతం అత్యున్నత వృత్తి నైపుణ్యాలు కలిగిన భారతీయులకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇండియన్ కంపెనీలు దాఖలు చేసిన దరఖాస్తులను పట్టి పట్టి మరీ జల్లెడపట్టే అవకాశం ఉంది. భారతీయ కంపెనీలు ఏళ్ళ తరబడి ఇతర దేశాల కంపెనీల కన్నా మరింత రుసుమును ప్రతి దరఖాస్తునకు సమర్పించుకుంటూ వస్తున్నాయి. వారు సగటున ఒక H-1B వీసా దరఖాస్తుకు 6,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆమోదం పొందిన తర్వాత ఆ లబ్దిదారులు లాంఛనపూర్వకమైన వీసా ఇంటర్వ్యూ, పాస్‌పోర్ట్‌ స్టాంపింగ్‌ కోసం అమెరికన్‌ దౌత్య వర్గాలు, దౌత్య కార్యా లయాల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఆప్పటి లోగా వారు తమ సోషల్‌ మీడియా ప్రొఫైల్‌, ఇ-మెయిల్స్‌, ఫోన్‌ నంబర్ల వివరాలతో సిద్ధంగా ఉండాలి.

Posted in Uncategorized

Latest Updates