ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి: సీఈవో రజత్ కుమార్

ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. కొత్త పథకాలు ప్రకటించడం కొత్త కార్యక్రమాలు అమలు చేయవద్దన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ…రైతుబందు చెక్కుల పంపిణీ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలనుసారం నిర్ణయం తీసుకుంటాన్నారు. వాజపేయి స్మృతి వనం పై కౌన్సిల్ లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పై వివరాలు తీసుకుని ఇది కోడ్ పరిధిలో వస్తుందా లేదా అనేది తెలుసుకుంటామన్నారు. మంత్రులు తమ అధికార కార్యక్రమంలో తప్ప పార్టీ కార్యక్రమంలో అధికార యంత్రాంగం, వాహనాలు ఉపయోగించ రాదని.. వాడితే చర్యలు తీసుకుంటామన్నారు.

అంతే కాదు అన్ని మీడియా ఛానల్స్ ని రికార్డ్ చేస్తున్నామని… ఒకే పార్టీకి అనుకూలంగా ప్రసారం చేయడం… పెయిడ్ ఆర్టికల్స్ ప్రసారం చేసిన ప్రింట్ చేసిన ఎన్నికల కోడ్ కిందకు వస్తుందన్నారు.

విభజన తో ఖమ్మంలో ని మూడు నియోజకవర్గంలో ని ఏడ మండలాలు ఏపీ లో కలిపారని..అక్కడి ఓట్లు కూడా ఏపీ లోకి బదిలీ చేసిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పామన్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చామన్నారు. నియోజకవర్గాల పెంపు పై కేంద్ర ఎన్నికల సంఘం నుండి సమాచారం లేదన్నారు రజత్ కుమార్.

 

Posted in Uncategorized

Latest Updates