ఇవాళ్టి నుంచే జనసేనాని బస్సు యాత్ర

pavanజనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (మే-20) నుంచి జన పోరాట యాత్ర నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి జన పోరాట యాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.ఇందులో భాగంగా శనివారం రాత్రే (మే-19) ఆయన ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురంలో జనపోరాట యాత్రలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు. ఉదయం కవిటి మండలం కపాసకుర్ది తీరప్రాంతం దగ్గర గంగమ్మ పూజలు, ఉదయం 11 గంటలకు స్వేచ్ఛావతి ఆలయంలో పవన్‌ పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జనసేన ఆధ్వర్యంలో నిరసన కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సూరంగి రాజావారి గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు జనసేనాని పవన్.

Posted in Uncategorized

Latest Updates