ఇవాళ ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం

హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ( మంగళవారం,జూలై-24)  సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించనుంది బాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ. సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి బంగారు బోనంతో బోనాల జాతర ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు. పాతబస్తీ మీరాలం మండి మహంకాళేశ్వర దేవాలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పోతరాజుల నృత్య విన్యాసాలతో బయలు దేరి వెళ్లి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు బోనాన్ని సమర్పిస్తామన్నారు.

ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, జూబ్లీహిల్స్  పెద్దమ్మ తల్లికి బంగారు బోనం తో పాటు పట్టువస్త్రాలు సమర్పించామన్నారు. ఈ నెల 26న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, 31న లాల్ దర్వాజా సింహవాహిణి దేవాలయం, ఆగస్టు 5న మీరాలం మండి మహంకాళేశ్వర దేవాలంయ అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించనున్నట్లు తెలిపింది కమిటీ.

Posted in Uncategorized

Latest Updates