ఇవాళ కరీంనగర్ లో రాష్ట్రపతి పర్యటన

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌  ఇవాళ (శనివారం) కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10.40 గంటలకు రాష్ట్రపతి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ బయల్దేరనున్నారు. అక్కడి ప్రతిమ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో 11 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి… ఆ తర్వాత ఆడిటోరియాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత మెడికల్‌ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందజేయనున్నారు. 11.30 గంటలకు రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 11.45 గంటలకు కోవింద్‌ తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates