ఇవాళ కూడా జైల్లోనే : సల్మాన్ బెయిల్ పై విచారణ వాయిదా

bail-salmanజింకలను వేటాడి చంపిన కేసులో జైల్లో ఉన్న బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కు మరో చేదు వార్త. జోధ్ పూర్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్ష తీర్పుపై సవాల్ చేశారు. జోధ్ పూర్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణను ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. దీంతో సల్మాన్ ఈ రోజు కూడా జైల్లోనే ఉండనున్నారు. బెయిల్ పిటీషన్ విచారణకు సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత కోర్టుకు వచ్చారు.

బెయిల్ పిటీషన్ పై విచారణ సందర్భంగా తనకు బెదిరింపులు వస్తున్నాయని కేసులో ప్రత్యర్ధి అయిన బోరా ఆరోపించారు. బెదిరిస్తూ SMSలు, ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నట్లు చెప్పాడు. బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా తన వాదన వినిపించకూడదని హెచ్చరిస్తున్నారని మీడియా ఎదుట చెప్పారు బోరా తరపు లాయర్ మహేష్. జైల్లో ఉన్న సల్మాన్ కు నెంబర్ 106 కేటాయించారు. సల్మాన్ ఖాన్ కు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఏమీ లేదని జైలు అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates