ఇవాళ కొలువుదీరనున్న తొమ్మిది కొత్త మున్సిపాలిటీలు

 రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి వీలుగా చట్టం చేసింది ప్రభుత్వం. తొలుత 61 మున్సిపాలిటీలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. మూడు రోజుల్లో ఇవి ఏర్పాటవుతాయి. ఇవాళ (బుధవారం) తొమ్మిది కొత్త మున్సిపాలిటీలు కొలువుదీరనున్నాయి. 48 మున్సిపాలిటీలు రేపు(గురువారం), 3వ తేదీన(శుక్రవారం) నాలుగు ప్రారంభమవుతాయి. మిగిలిన ఏడు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసిన తరువాత ఏర్పడుతాయి.

ఇవాళ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి, ఆలంపూర్, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, కొత్తపల్లి, మంచిర్యాల జిల్లాలో నాస్పూర్, చెన్నూర్, క్యాతన్ పల్లి, లక్సెట్టిపేట, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపాలిటీలుగా మారుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ఇన్ ఛార్జి కమిషనర్లుగా నియమితులైన తహసీల్దారులు,ఎంపీడీఓలు, ఇతర అధికారులకు పురపాలక శాఖ నిన్న( మంగళవారం) అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి కమిషనర్లు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల గురించి వివరించారు.

Posted in Uncategorized

Latest Updates