ఇవాళ గజ్వేల్ లో సీఎం సభ

హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ(బుధవారం) తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కేసీఆర్ ప్రచారం నిర్వహించలేదు. సీఎం అల్లుడు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ.హరిష్ రావు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎం ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తున్నందున 3 గంటలకు గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు.

ఇవాళ, రేపు ఫోన్ లో దిశానిర్దేశం

ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. 7వ తేదీన పోలింగ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇవళ, రేపు నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిస్థితిని సమీక్షించనున్నారు సీఎం. పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎంపీలతో ఫోన్ లో మాట్లాడుతారు. ప్రతి అభ్యర్థి నుంచి సమాచారం తీసుకోవడంతోపాటు స్థానిక స్థితిగతులు తెలుసుకుంటారు. ఏడో తేదీన అభ్యర్థులు దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని, ఏజెంట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించనున్నారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates