ఇవాళ గ్రూప్ 4 పరీక్ష

ఇవాళ(ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. 1867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1046 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు  చేపట్టారు.

నిముషం నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరీక్షా కేంద్రాల దగ్గర పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates