ఇవాళ ‘ఛత్రపతి’ జయంతి

Chatrapati-Shivaji-Maharajమరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా బతికిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఇవాళ ఆయన 391వ జయంతి. ఈ సందర్భంగా  దేశ వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి జయంతి వేడుకలు జరిగాయి. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు.

మొదట శివాజీ తండ్రి.. షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు.

శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630న పుణె లోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్భీ కులానికి చెందినవారు. తల్లి పూజించే దేవత అయిన పార్వతి కలిసివచ్చేలా శివాజీకి పేరు పెట్టింది.

షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధితో షాహాజి ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పుణె వదిలి వెల్లిపోయారు. షాహాజీ పుణెలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. షాహాజీ పుణెలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ ఉండేలా విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలను నేర్పించింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు శివాజీ. తన తండ్రి పొందిన ఓటములను పూర్తిగా తెలుసుకుని..కొద్ది కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో ట్రైనింగ్ అయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పుణె ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ‘ఛత్రపతి ‘ అని బిరుదును ప్రదానం చేసారు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గంటలకు రాయఘడ్ కోటలో చనిపోయాడు.

Posted in Uncategorized

Latest Updates