ఇవాళ పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు

rainsదక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.  రానున్న మూడురోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈదురుగాలులతో వర్షం కురిసినప్పటికి ఎండలు ఇదేస్థాయిలో మండే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

Posted in Uncategorized

Latest Updates