ఇవాళ పీవీ 14వ వర్ధంతి..నివాళులర్పించిన నేతలు

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు…గొప్ప రాజనీతి వేత్త, బహుభాషావేత్త….అని కొనియాడారు ప్రముఖులు. రాజకీయాల్లో పీవీ అపర చాణక్యుడని అన్నారు. ఇవాళ పీవీ 14వ వర్ధంతి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో నివాళులు అర్పించారు నేతలు, ఉన్నతాధికారులు. బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, నాయిని నర్సింహారెడ్డి, తలసానితో పాటు ఇతర ప్రముఖులు పీవీ సేవలను స్మరించుకున్నారు. క్లిష్ట సమయంలో దేశానికి ప్రధానై.. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచారన్నారు. ప్రపంచ దేశాల సరసన భారత్ నిలిచిందంటే పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమన్నారు నేతలు.

Posted in Uncategorized

Latest Updates