ఇవాళ పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

చరిత్రలో తొలిసారి జనం లేని జాతరగా ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు

విజయనగరం: చరిత్రలో తొలిసారిగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారి జాతర జనం లేకుండానే జరుగుతోంది.  అమ్మలగన్న అమ్మ పైడితల్లి అమ్మవారికి ఇవాళ తోలేళ్ల ఉత్సవం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ సంబరం నిర్వహించనున్నారు. దేశంలో ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఉత్సవాలు కరోనా నిబంధనల మేరకు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్ల విధానం తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే అమ్మవారి దర్శనాలు కల్పిస్తున్నారు అధికారులు.

Latest Updates