ఇవాళ ప్రధాని ఒక్కరోజు దీక్ష

దేశంలో కాంగ్రెస్, విపక్షాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమైంది బీజేపీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకపోవడానికి కాంగ్రెస్ తీరే కారణమని చెప్పేందుకు…గురువారం (ఏప్రిల్-12) దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్నారు కమలం నేతలు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, MPలు ఉపవాస దీక్షలో పాల్గొంటారు. ప్రధాని… అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూనే… దీక్షలో పాల్గొంటారు. ప్రజాస్వామ్య శత్రువులపై పోరాటానికి అంతా కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు మోడీ.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… హుబ్లీలో దీక్షకు కూర్చోనున్నారు. కేంద్రమంత్రి JP నడ్డా… ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో దీక్షలో పాల్గొంటారు. మంత్రులు, MPలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాల్గొనాలని పార్టీ హైకమాండ్ సూచించింది. BJP నిరసనలపై విరుచుకుపడ్డాయి ప్రతిపక్షాలు. ప్రజా సమస్యలు… కుంభకోణాలను చర్చకు రాకుండా చేసేందుకే… పార్లమెంట్ ను నడవనీయలేదని ఆరోపించాయి. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే… దీక్ష డ్రామా చేస్తున్నారని విమర్శించాయి. BJP నేతల దీక్షను విమర్శిస్తూ ట్వీట్ చేశారు ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్.

Posted in Uncategorized

Latest Updates