ఇవాళ ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం

ఢిల్లీ : సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. భేటీలోరాష్ట్రానికి సంబంధించిన 10 పెండింగ్ అంశాలను ప్రస్తావించనున్నారు కేసీఆర్. రాష్ట్ర్ర విభజన హామీలు, పెండింగ్ అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, రిజర్వేషన్ల పెంపు బిల్లు అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నారు.

సెక్రటేరియట్ నిర్మాణానికి బైసన్ పోల్ గ్రౌండ్, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపుపై ప్రధానితో చర్చించనున్నారు. కాళేశ్వారం ప్రాజెక్టుకు కనీసం రూ.20 వేల కోట్లు సాయం కోరనున్నారు సీఎం కేసీఆర్. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates