ఇవాళ ప్రపంచ ఇడ్లీ డే : ఆయిల్ లేని హెల్దీ ఫుడ్ ఇదే

idli-dayఇడ్లీ.. బ్రేక్ ఫాస్ట్ లో టాప్ ప్లేస్ దీనిదే. వారంలో రెండు రోజులు కనీసం ఇడ్లీనే ఉంటుంది. హడావిడితోపాటు ఉరుకులు, పరుగుల జీవితంలో ఇడ్లీకి ఇంకా ప్రయార్టీ పెరిగింది. త్వరగా అయిపోయేది కాకుండా లైట్ ఫుడ్ గా ఇడ్లీకి ఫస్ట్ ప్లేస్ ఉంది. అంతే కాదండీ.. ఒంట్లో బాగోలేకపోయినా, జ్వరం వచ్చినా, ఆస్పత్రి బెడ్ పైకి చేరినా, చుట్టాలు నలుగురు ఎక్కువ వచ్చినా ఇడ్లీ ఉండాల్సిందే. ఉండి తీరాల్సిందే. ఆరోగ్యం ఏమాత్రం తేడా వచ్చినా.. ఆ పూటకి ఇడ్లీకి అర్జస్ట్ అయిపోతాం. లైట్ గా ఉండటమే కాకుండా.. హెల్దీ ఫుడ్ డాక్టర్లు సైతం నొక్కి మరీ చెబుతారు. ఓ రెండు రోజులు మిగతా ఆహారం కాకుండా ఇడ్లీ తినండి అని సూచన కూడా చేస్తారు. అలాంటి ఇడ్లీకి ఓ రోజు ఉంది. అదే మార్చి 30వ తేదీ.

ఇడ్లీ అనగానే అవునా అని నిట్టూర్పులు చేసే ఈ కాలం యువత కూడా ఎక్కువగా తినేది ఇడ్లీనే. చట్నీతోనే కాదు సాంబార్ తో నాలుగు ఇడ్లీలు తింటే చాలు.. ఆ రోజు అన్నం తినకపోయినా హ్యాపీనే. అలాంటి ఇడ్లీ ఇవాళ పుట్టినరోజు చేసుకుంటుంది. దక్షిణ భారతంలో ఇడ్లీని మించి రుచికరమైన ఆహారం మరొకటి లేదని వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెబుతోంది. రొట్టెలు మాత్రమే ఫేవరెట్ పుడ్ గా భావించే ఉత్తర భారత ప్రజలు కూడా వీటి తయారీ విధానం గురించి తెలుసుకుని మరీ.. ఇప్పుడు ఇడ్లీ రుచిని ఆస్వాదిస్తున్నారు. ఇడ్లీలను తయారు చేయడం చాలా సులభం కావడంలో 70శాతం మంది ప్రతి ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీకి ప్రయార్టీ ఇస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. కొబ్బరి చట్నీ, సాంబార్, కొబ్బరి కారంలో ఇడ్లీని కలిపి తింటే ఆ రుచి వేరయ్యా అంటున్నారు. ముఖ్యంగా పేషెంట్లకి ఇదే ఫుడ్.

ఈ ఇడ్లీలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. స్పినాచ్ ఇడ్లీ, కాక్ టెయిల్ ఇడ్లీ, స్టఫడ్ ఇడ్లీ, చాక్ లెట్ ఇడ్లీ, కైమా ఇడ్లీ ఇలా కాలంలో దాని టేస్ట్ కూడా మారింది. గతంలో పెద్ద పెద్ద ఇడ్లీలు ఉండేవి. ఇప్పుడు చిన్నచిన్న ఇడ్లీతో వెరైటీలు వచ్చాయి. వాటిలో ప్లేవర్స్ కూడా వచ్చేశాయి.

ఇడ్లీలో పోషకాహారాలు ఇలా :

ఇడ్లీలో ప్రొటీన్లు, ఫైబర్, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక సింగిల్ ఇడ్లీ తినడం ద్వారా 2 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఆరోగ్యకరమైన పెద్దలకు ప్రతి రోజూ 225 గ్రాముల ప్రొటీన్, కార్బొహైడ్రేట్లు అవసరం. ముఖ్యంగా ఇడ్లీలను తయారు చేయడానికి ఆయిల్ అవసరం కూడా లేకపోవడంతో కొవ్వు వచ్చే సమస్య అస్సలు ఉండదు. ఒక్కో ఇడ్లీలో 39 కేలరీలు ఉంటాయి. ఒక్కో ఇడ్లీలో 65 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఇడ్లీ లను తినడం ద్వారా బ్లడ్ ప్లజర్ వంటి సమస్యలు కూడా దరి చేరవు. రోజుకి నాలుగు పెద్ద ఇడ్లీలు తింటే.. ఆరోగ్యానికి కావాల్సిన హెల్దీ ప్రొటీన్స్ అన్నీ పుష్కలంగా ఒంట్లోకి చేరిపోతాయి. అందుకే ఇడ్లీ మనందరికీ హెల్త్ అండ్ హెల్దీ ఫుడ్ అయిపోయింది.. .

Posted in Uncategorized

Latest Updates