ఇవాళ రాజస్తాన్‌ vs పంజాబ్‌..ఓడితే ఇంటికే‌

అబుదాబి: ఐపీఎల్‌‌‌‌ 13 లో మరో కీలక మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది.శుక్రవారం ఇక్కడ జరిగే మ్యాచ్‌‌‌‌లో  కింగ్స్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ పంజాబ్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌ తలపడనున్నాయి. ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌ ఇరు జట్లకు కీలకం. మరీ ముఖ్యంగా రాజస్తాన్‌‌‌‌కు విజయం అత్యవసరం. ఓడిపోతే ప్లే ఆఫ్‌‌‌‌ పోటీ నుంచి ఔటవుతుంది. మరోపక్క రాయల్స్‌‌‌‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌కు మరింత దగ్గరవ్వాలని పంజాబ్‌‌‌‌ భావిస్తోంది. ఫామ్‌‌‌‌ ప్రకారం పంజాబే ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌. జట్టు మొత్తం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కెప్టెన్‌‌‌‌ రాహుల్‌‌‌‌ వారి ప్రధాన బలం కాగా. క్రిస్ గేల్‌‌‌‌ రాకతో బ్యాటింగ్‌‌‌‌లో మరింత బ్యాలెన్స్‌‌‌‌ వచ్చింది. మన్‌‌‌‌దీప్‌‌‌‌ కూడా రాణించడం కలిసొచ్చే అంశం. అయితే ఈ మ్యాచ్‌‌‌‌తో మయాంక్‌‌‌‌ రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌; మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడాతో బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ బలంగా ఉంది.  షమీ ఆధ్వర్యంలోనే బౌలింగ్‌‌‌‌లో లైనప్‌‌‌‌లోనూ పెద్దగా సమస్యల్లేవు. మరోపక్క రాజస్తాన్‌‌‌‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ సూపర్‌‌‌‌ సెంచరీ చేయడంతో ముంబైపై లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గెలిచిన రాజస్తాన్‌‌‌‌లో కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది.  స్టోక్స్‌‌‌‌ గత పెర్ఫామెన్స్‌‌‌‌ను రిపీట్‌‌‌‌ చేయాలని కోరుకుంటుంది. సంజు శాంసన్‌‌‌‌ కీలకం కానుండగా.. స్మిత్‌‌‌‌, బట్లర్‌‌‌‌ రాణించడంపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్చర్‌‌‌‌ నాయకత్వంలోని బౌలర్లు ఇటీవల తేలిపోతుండడం రాయల్స్‌‌‌‌ను కాస్త కలవరపెడుతుంది.  ఈ చావోరేవో లాంటి మ్యాచ్‌‌‌‌లో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Latest Updates