ఇవాళ, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు


హైదరాబాద్ : ఇవాళ, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 11:30 గంటలకు ‘టిట్లీ’తుపానుగా మారి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం. తదుపరి వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయానికి ఒడిశా దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాల్లోని గోపాల్‌పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అనంతరం ఈశాన్య దిశగా ప్రయాణించి కోస్తా, ఒడిశా మీదుగా గాంగ్‌ టక్, పశ్చిమ బెంగాల్‌ ప్రాం తం వైపు ప్రయాణించి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని చెపుతున్నారు వాతావరణ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates