ఇవాళ లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు

న్యూఢిల్లీ:  ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్ సభ ముందుకు రానుంది. న్యాయ‌శాఖ మంత్రి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్.. ఈ బిల్లును దిగువ సభలో ప్రవేశపెడతారు. ఆ త‌ర్వాత దీనిపై చ‌ర్చ ఉంటుంది. బిల్లు రూపంలో ట్రిపుల్ తలాక్‌ పై ఆర్డినెన్స్‌ను లోక్‌ స‌భ‌లో చర్చించనున్న‌ట్లు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారా శాఖ‌ మంత్రి విజ‌య్ గోయ‌ల్ తెలిపారు. బీజేపీ ఎంపీల‌కు విప్ జారీ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

ట్రిపుల్ త‌లాక్‌ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని.. తమ అభిప్రాయాన్ని వివరిస్తామని లోక్ సభ ప్రతిపక్షనేత, ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అన్నారు. ఇదే విషయంపై ఆయన.. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ ను కలిశారు. బిల్లుపై చర్చ… మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని అప్పీల్ చేశారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నామని.. స‌భా వ్యవహారాలకు సహకరిస్తే, క‌చ్చితంగా ట్రిపుల్ త‌లాక్‌పై అర్థవంతమైన డిస్కషన్ జరుగుతుందని కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates