ఇవాళ వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభ

హైదరాబాద్ :  టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ  సిఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ(శుక్రవారం) వనపర్తి లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.   ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలో నాగవరంలో జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సిఎం పాల్గొననున్నారు . మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్ పోర్ట్  నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వస్తారనే అంచనాతో నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 100 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ 600 ఎకరాలను కేటాయించారు.  సభ ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు ఇప్పటికే పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్ల పై ఐజీ, రెండు జిల్లాల ఎస్పీలు సమీ క్ష‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates