ఇవాళ వరంగల్ కు ..మిస్‌ అమెరికా

మిస్ అమెరికా గూడూరు త్రిష ఇవాళ వరంగల్ కు రానున్నారు.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా లయన్స్‌ క్లబ్‌ భీమారం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్నారు. వరంగల్‌ లో పుట్టిన గూడూరు త్రిష న్యూయార్కులో స్థిరపడి… మిస్‌ అమెరికాగా ఎంపికైంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలను ఉదయం 9 గంటలకు త్రిష కలవనున్నారు. గతంలో ఇక్కడకు వచ్చిన సమయంలో కొన్ని ఆశ్రమాలను సందర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు. లయన్స్‌క్లబ్‌ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి అనాథాశ్రమానికి, కొత్తవాడలోని అంధుల పాఠశాలకు వెళ్తారు. అక్కడ వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. 2014లో కూడా గూడూరు త్రిష మిస్‌ సౌత్‌ ఏషియాగా ఎంపికైంది.

 

 

Posted in Uncategorized

Latest Updates