ఇవాళ విశాఖకు సీఎం కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రాష్ట్రాల పర్యటనకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటే లక్ష్యమన్న కేసీఆర్ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందు కోసం నెల రోజుల పాటు ప్రత్యేక విమానాన్ని ఎంగేజ్ చేసుకున్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వెళ్లనున్నారు. కేసీఆర్. విశాఖలోని శారదాపీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని  రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకొని.. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. రాత్రికి ఒడిశా ప్రభుత్వ అధికార నివాసంలో కేసీఆర్ బసచేస్తారు.

రేపు(సోమవారం) ఉదయం రోడ్డు మార్గంలో వెళ్లి కోణార్క్ దేవాలయాన్ని సందర్శిస్తారు కేసీఆర్. పూరి జగన్నాథ్ ఆలయానికి వెళతారు. పూజల తర్వాత సోమవారం సాయంత్రం.. ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ నుంచి కోల్ కతా వెళ్తారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశమై కూటమిపై చర్చిస్తారు. తర్వాత కాళీమాత ఆలయంలో పూజల చేసి.. రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉండనున్న కేసీఆర్.. ప్రధాని  మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. మాయావతి, అఖిలేష్ లతో సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చిస్తారు.

Posted in Uncategorized

Latest Updates