ఇవాళ వేములవాడలో సద్దుల బతుకమ్మ

రాష్ట్రంలో 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాత్రం ఏడు రోజులు మాత్రమే నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ (ఆదివారం, అక్టోబర్-14) సద్దుల బతుకమ్మను నిర్వహించనున్నారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వేములవాడలోని మూలవాగు ముస్తాబైంది. వేములవాడలో ఏడురోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు దాదాపు రూ.21 లక్షలు ఖర్చు చేసి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. బతుకమ్మ తెప్పకు అందంగా రంగులు వేశారు. మూలవాగు పక్కన ఉన్న ప్రాంతాన్ని చదునుచేయించి…విద్యుత్ దీపాలతో అలంకరించారు.

Posted in Uncategorized

Latest Updates