ఇవి సాగుతాయంట : హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీతో రోడ్లు

GHMC PMB ROADSహైదరాబాద్ లోని రోడ్ల నాణ్యత, మన్నికను మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించింది GHMC. హైదరాబాద్ ప్రజలకు మెరుగైన రోడ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడేదిలేదని, అత్యాధునిక టెక్నాలజీ, అత్యుత్తమ సామగ్రితో రోడ్లను ఏర్పాటుచేయాలని GHMCని ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఈ క్రమంలో అధికారులు పాలిమర్ మాడిఫైడ్ బిటమిన్ (PMB) రోడ్లను వేయాలని నిర్ణయించారు.

డాంబర్‌లో పాలిమర్ (ప్లాస్టిక్ తరహా) మిశ్రమాన్ని కలిపి PMBని తయారు చేస్తారు. పాలిమర్ వల్ల నీళ్లు నిలిచినా రోడ్లు పాడయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండటమేకాకుండా, ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే స్వభావం ఈ రోడ్ల సొంతం. దేశవ్యాప్తంగా ముంబై వంటి మహా నగరాల్లో ప్రధాన రోడ్లను PMB పద్ధతిలోనే వేస్తున్నారు. హైదరాబాద్‌లో రోడ్లు మాటిమాటికీ పాడవుతుండటంతో నగరంలోనూ PMB రోడ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది GHMC. తొలివిడుతలో ఎంపిక చేసిన రోడ్లలో PMB విధానాన్ని వాడనున్నది.

పదేళ్లు గ్యారంటీ :
CC రోడ్ల మాదిరిగానే PMB రోడ్లు ఎంతో పటిష్ఠంగా ఉంటాయని చెప్పారు అధికారులు. వీటికి ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునే సామర్థ్యం ఉంటుందని..వర్షాలకు చెక్కుచెదరకుండా ఉంటాయన్నారు. సాగే గుణం(ఎలాస్టిసిటీ) ఉండటంతో కంకరతో అతుక్కుపోయి త్వరగా లేవదన్నారు. అధిక ట్రాఫిక్ లోడ్‌ను సైతం తట్టుకుంటుందన్నారు. ఫలితంగా రోడ్ల మన్నిక పెరుగుతుందని, పదేండ్ల పాటు మన్నుతాయని అధికారులు చెప్తున్నారు.

PMBకి ఎంపికచేసిన రోడ్లు..
(మొత్తం 14కి.మీలు)
-కట్టమైసమ్మ గుడి-గోశాల
-కట్టమైసమ్మ గుడి- అశోక్‌నగర్
-కాచిగూడ రైల్వేస్టేషన్-నింబోలీఅడ్డ
-బర్కత్‌పుర మెయిన్‌రోడ్
-కాచిగూడ క్రాస్‌రోడ్-లింగంపల్లి
-విద్యానగర్ బ్రిడ్జి-శంకర్‌మఠ్ (వయా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్)
-ఫీవర్ హాస్పిటల్ జంక్షన్-తిలక్‌నగర్
-అలీకేఫ్ జంక్షన్-ఛే నంబర్-గోల్నాక (వయా జిందాతిలిస్మాత్ రోడ్)
-శివం రోడ్-ఛే నంబర్

Posted in Uncategorized

Latest Updates