ఇస్రో రహస్య ప్రయోగం : వ్యోమగాముల కోసం క్రూ ఎస్కేప్

isronaut

ఇస్రో.. ఎవరీ తెలియకుండా.. ఎలాంటి హంగామా, పబ్లిసిటీ లేకుండా అద్బుత ప్రయోగం చేసింది. నాసాకు కూడా ఉప్పందకుండా.. వ్యోమగాముల రక్షణపై రహస్యంగా ప్రయోగం నిర్వహించింది. ఇస్రోలోని ఉద్యోగులకే సమాచారం లేదంటే ఆశ్చర్యం.. విడ్డూరం. అతి కొద్ది మంది శాస్త్రవేత్తల సమక్షంలో జూలై 5వ తేదీ తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు.. సురక్షితంగా.. ఎలాంటి భయం లేకుండా సేఫ్ ల్యాండింగ్ కోసం ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టింది ఇస్రో. రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లటం.. తిరిగి వచ్చే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. సురక్షితంగా బయటకు రావటంపై ఈ ప్రయోగం జరిగింది. సిబ్బంది ఉండే క్రూ మాడ్యూల్‌ను నౌక నుంచి వేరు చేయాలనుకుంటే.. ఆ ప్రక్రియను ఎలా వేగంగా నిర్వహించాలో ఈ పరీక్ష ద్వారా చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియ వల్ల వ్యోమగాములు సురక్షితంగా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది.

శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ప్యాడ్ అబార్ట్ టెస్ట్ పేరుతో దీన్ని చేపట్టారు. లాంచ్ ప్యాడ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ సమయంలో వ్యోమగాములు సురక్షితంగా బయటపడే ప్రక్రియను ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా పరీక్షించారు.

5 గంటల కౌంట్‌డౌన్ తర్వాత.. గురువారం ఉదయం 7గంటలకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ మాడ్యుల్ గాలిలోకి లేచింది. బరువు 12.6 టన్నులు. 259 సెకన్లలోనే పరీక్షను పూర్తి చేశారు. బంగాళాఖాతం సముద్రంపైకి వెళ్లిన ఈ క్రూ మాడ్యుల్ నుంచి ప్యారాచూట్లు వేరుపడ్డాయి. నిదానంగా సముద్రంలో పడ్డాయి. అప్పటికే భారీ భద్రతా సిబ్బందితో సిద్ధంగా ఉన్న మరబోట్లు.. మాడ్యూల్స్ ను శ్రీహరి కోటకు తీసుకొచ్చారు. 300 సెన్సార్లు ఈ మొత్తం ప్రక్రియను రికార్డ్ చేశాయి. మొత్తం ప్రక్రియ విజయవంతం కావటం ఓ రికార్డ్ అయితే.. ఎవరికీ కనీసం సమాచారం లేకుండా.. ఇస్రో సిబ్బంది కూడా తెలియకుండా రహస్యంగా ఇస్రో ఈ పరీక్ష నిర్వహించటమే విశేషం..

Posted in Uncategorized

Latest Updates