ఈగిల్ టన్ రిసార్ట్ లో కాంగ్రెస్ క్యాంప్

eagకర్ణాటకలో క్యాంపు రాజకీయాలకు బిడిదిలోని ఈగిల్ టన్ రిసార్ట్ మరోసారి వేదిక అయింది.ఎట్టిపరిస్ధితుల్లో బీజేపీ అధికారం చేపట్టకుండా ఉండేందుకు జేడీఎస్, కాంగ్రెసె పార్టీలు లు తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో పడ్డాయి. తమ ఎమ్మెల్యేలను ఈగిల్ టన్ రిసార్ట్ కు రిసార్ట్ కు తరలించనుంది కాంగ్రెస్. ఇప్పటికే జేడీఎస్ తన ఎమ్మెల్యేలను ఈగిల్ టన్ రిసార్టుకు తరలించింది. రెండు పార్టీల ఎమ్మెల్యేల భాధ్యతను కాంగ్రెస్ లీడర్ డి.కె. శివకుమార్ కు అప్పచెప్పింది కాంగ్రెస్ అధినాయకత్వం.

గతంలో కూడా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా… అహ్మద్ పటేల్ ను ఎట్టిపరిస్ధితుల్లో రాజ్యసభకు పంపించాలని గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపరేషన్ కమలంకు గురికాకుండా ఉందేందుకు వారిని బిడిదిలోని ఈగిల్ టన్ రిసార్ట్ కు తరలించింది కాంగ్రెస్. అప్పుడు కూడా ఎమ్మెల్యేల నిర్వహణ భాధ్యతలను శివకుమార్ చూసుకొన్నారు. ఇప్పుడు మరోసారి ఈగిల్ టన్ రిసార్ట్ క్యాంపు రాజకీయాలకు వేదిక అయింది.  5 గంటలకు రాజ్ భవన్ చేరుకోనున్నారు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు.

Posted in Uncategorized

Latest Updates