ఈజిప్ట్ రాణి ఇలా ఉండేది : 3,400 ఏళ్ల నాటి మమ్మీకి 3D రూపం

mummy 3Dమమ్మీ అనగానే అమ్మ గుర్తుకొస్తుంది.. అదే ఈజిప్ట్ మమ్మీ అనగానే శవపేటికలు గుర్తుకొస్తాయి. వేల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ మమ్మీలకు ఇప్పుడు త్రీడి టెక్నాలజీతో రూపం ఇచ్చారు. ఈ ప్రయోగాన్ని బ్రిస్టోల్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు చేశారు. 3వేల 400 ఏళ్ల క్రితం ఈజిప్ట్ రాణి నెఫర్ టిటీ.. మమ్మీ ఆధారంగా ఆమె ముఖం ఎలా ఉంటుందో.. ఎలాంటి ఆభరణాలు ధరించి ఉండేదో 3డీ టెక్నాలజీతో తీర్చిదిద్దారు. ఈమె టుటన్ కామున్ తల్లి. ఆమె ముఖం, ఆభరణాలకు ఓ రూపం తీసుకురావటానికి 500 గంటలు కష్టపడ్డారు. ఈమె ఈజిప్ట్ ను 3,300 ఏళ్ల క్రితం పరిపాలించింది.

ఈజిప్ట్ మమ్మీకి 3D ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఓ రూపం ఇవ్వటం ఇదే మొదటిసారి. మమ్మీ ముఖం ఆధారంగా.. అప్పట్లో రాణి నెఫర్ టిటీ ఇలా ఉండేదని సైంటిస్ట్ లు చెబుతున్నారు. దీనిపై నెటిజన్లు, కొందరు శాస్త్రవేత్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో రాణి ఇంత అందంగా ఉండేది కాదని.. నల్లగా ఉండేదని చెబుతున్నారు. కలర్ విషయంలో వైట్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదని కామెంట్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates