ఈజ్ ఆఫ్ డూయింగ్ లో సెకండ్ ర్యాంక్ అందుకే : GHMC కమిషనర్

ప్రపంచ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా నవాబ్ జంగ్ నవాజ్ కు నివాళులు అర్పించారు GHMC కమిషనర్ జనార్ధనరెడ్డి. ఓ ప్రాంతం అభివృద్ధి చెందడం అక్కడున్న ఇంజినీర్లమీదే ఆధారపడి ఉంటుందున్నారు కమిషనర్. తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి చాటిన కాళేశ్వరం క్రెడిట్ మన ఇంజినీర్లదే అని చెప్పారు. తెలంగాణలో ఇంజినీర్లు బాగా పనిచేస్తున్నారనీ, కానీ చెప్పుకునే విషయంలో వెనుకబడుతున్నామనీ అన్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వందశాతం మార్కులు వచ్చినా సెకండ్ ర్యాంక్ తోసరిపెట్టుకున్నామని చెప్పారు.

మంగళవారం(జులై-10) ఢిల్లీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఏపీ మొదటిస్ధానంలో నిలవగా, తెలంగాణ రెండవస్ధానంలో నిలిచింది. ఫీడ్ బ్యాక్ స్కోర్ లో ఏపీకంటే కాస్త వెనుబడింది తెలంగాణ. అయితే సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం వంద శాతం స్కోర్ సాధించింది

Posted in Uncategorized

Latest Updates