ఈడీ పై విజయ్ మాల్యా ఫన్నీ ట్వీట్

 బ్యాంకుల్లో అప్పు చేసి లండన్ కు వెళ్లిపోయిన విజయ్ మాల్య… ఈడీ పై సెటైర్ వేశారు. ప్రస్తుతం మాల్య కేసు విచారణలో ఉంది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడానికే మాల్య లండన్ పారిపోయారని ఈడీ ఆరోపించింది. దీంతో మాల్య తరపు లాయర్ వివరణ ఇచ్చారు. మాల్య పారిపోలేదని లండన్ లో జరిగే బిజినెస్ సమావేశాలకు వెళ్లారని అన్నారు. ఈ విషయం పై ఈడీ స్పందిస్తూ.. బిజినెస్ మీటింగ్ కు వెళ్లారనడానికి తగిన ఆధారాలు లేవని.. మీటింగ్ కు వెళ్లేవారెవరైనా.. 300 బ్యాగులు తీసుకువెళ్తారా అని ఈడీ ప్రశ్నించింది.

ఈడీ అడిగిన ప్రశ్నకు మాల్య తన ట్విటర్ ద్వారా సమాధానమిచ్చారు.  ‘విమానం మొత్తాన్ని నేనే బుక్ చేసుకున్నానని.. భవిష్యత్తులో ఈడీ అంటుందేమో’ అని మాల్య వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ మధ్య లండన్ కోర్టులో జరిగిన వాధనలో.. మాల్య తప్పక భారత్ కు వెళ్లాల్సిందే అని కోర్టు తీర్పు ఇచ్చింది. తొందరలోనే మాల్యను భారత్ కు తీసుకురావడానికి ఈడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

Posted in Uncategorized

Latest Updates