ఈనెల 29న కలెక్టరేట్ల ముట్టడి: బీసీ సంఘాల పిలుపు


పంచాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22 శాతం కు తగ్గించడాన్ని నిరసనగా… ఈ నెల 29న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. అంతకు ముందు 28న చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. 30న హైదరాబాద్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నారు.

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బీసీ సంఘాలు, వివిధ పార్టీ నేతలు, సామాజిక ఉద్యమ సంఘాలు, న్యాయనిపుణులు సమావేశమై ఆర్డినెన్స్ పై చర్చించారు. రిజర్వేషన్ల తగ్గింపుపై న్యాయపోరాటం చేయాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ. కలెక్టరేట్ ముట్టడిలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. రిజర్వేషన్లను కుదించడం బీసీలను అవమానించడమేనన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలన్నారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.

జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లోని నాయకులంతా కేసీఆర్ పై ఒత్తిడి తేవాలన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య. బీసీల ఉద్యమానికి మాలమహానాడు మద్దతిస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates