ఈఫిల్ టవర్ కు ఉగ్రవాదుల ఫీవర్

EFIL TOWERవరల్డ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఈఫిల్ టవర్ కు ఉగ్రవాదుల ఫీవర్ పట్టుకుంది. ఉగ్రవాదుల దాడుల నుంచి ఈఫిల్ టవర్ ను కాపాడుకునేందుకు చుట్టూ ఫెన్సింగ్ ను వేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. 40 మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఈఫిల్ టవర్ చుట్టూ కట్టుదిట్టమైన ఫెన్సింగ్ వేస్తున్నారు. దీనిని పర్మినెంటుగా ఉంచాలనే ఉద్దేశంతో భారీ ఖర్చు చేస్తున్నారు అధికారులు. 2015 నుంచి ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 240 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ లో ఉన్న పురాతన కట్టడల చుట్టూ స్పెషల్ సెక్యూరిటీని పెంచుతున్నారు.

ఈఫిల్ టవర్‌ ను చూసేందుకు ప్రపంచ పర్యాటకులు వస్తుంటారు. భద్రతా పరంగా కొత్త ఫెన్సింగ్ రాతిగోడలాగా ఉందని అధికారులు అంటున్నారు. టవర్‌ కు రెండు వైపులా గ్లాస్ గోడలను నిర్మించారు. మిగతా రెండు వైపులా మెటల్ ఫెన్సింగ్‌ ను ఏర్పాటు చేశారు. వాహనాలతో దాడులను అడ్డుకునేందుకు ఈ ఏర్పాట్లన్నీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది క‌నీసం 70 ల‌క్ష‌ల మంది ప‌ర్యాట‌కులు ఈఫిల్‌ ను చూసేందుకు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో టవర్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ భారీ ఫెన్సింగ్ ను నిర్మిస్తున్నామని తెలిపారు ఆ దేశ అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates