ఈఫిల్ టవర్ కు నిరసన సెగ

పారిస్: ఆయిల్ ధరల పెంపుపై జరుగుతున్న ‘యెల్లో వెస్ట్’ నిరసనల సెగ ఈఫిల్ టవర్ ను తాకింది. ఆందోళనలు ప్రారంభమై మూడు వారాలు పూర్తి కావడం. వీకెండ్ కావడంతో హింస చెలరేగే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. టవర్ ను టార్గెట్ చేసుకొని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందన్న రిపోర్టులతో ఇవాళ(శనివారం) టవర్ ను క్లోజ్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టవర్ తో పాటు షాప్స్,మ్యూజియాలు క్లోజ్ కానున్నాయి. పారిస్ లో ఇప్పటికే మోహరించిన 8వేల మంది పోలీసులకు తోడుగా అదనపు బలగాలను రప్పించాలని భావిస్తోంది.

పారిస్ లో మొత్తం హైరిస్క్ ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసే అవకాశం ఉందని వీధులను క్లియర్ చేస్తున్నారు. గ్లాస్ కంటెయినర్లను,రెయిలింగ్స్ ను తొలగించి మెషిన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 89వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. గత వీకెండ్ లో ఆందోళన హింసాత్మకంగా మారడంతో 130 మంది గాయపడ్డారు. నాలుగు వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వారంలో జరగాల్సిన ఆరు సాకర్  మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ ఆందోళనల ప్రభావం క్రిస్మస్ షాపింగ్ పై పడుతందని వ్యాపారుల చెపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates