ఈవీఎం ట్యాంపరింగ్ అంటే జనాలను అవమానించినట్టే : KTR మీట్ ద ప్రెస్ హైలైట్స్ ఇవీ

  • జీవితకాలం మరిచిపోలేని గెలుపిది
  • సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లలోపే సాధిస్తుంది
  • కేసీఆర్ జనం కోసం ఫ్రంట్ పెడుతున్నారు
  • ఏపీలో మా వ్యూహమేంటో త్వరలోనే చెబుతాం
  • 2019 ఎన్నికల తర్వాత టీడీపీ, బాబు నామమాత్రంగా మిగిలిపోతారు
  • ఈవీఎం ట్యాంపరింగ్ అనడం జనాలను అవమానించడమే
  • జనం ప్రోగ్రెస్ కోరుకున్నారు.. కాంగ్రెస్ కాదు
  • మేం కంగారు పెడతాం.. పడం

 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పాల్గొన్నారు. టీఆర్ఎస్ చారిత్రాత్మక గెలుపు సాధించిందన్నారు. ఇది తాను జీవించినంత కాలం మర్చిపోలేని విజయం అన్నారు. అన్ని పార్టీలు ఒకవైపు.. టీఆర్ఎస్ ఒకవైపు ఉంటే.. జనం కూడా టీఆర్ఎస్ వైపే నిలిచారని చెప్పారు. 47 శాతం ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారంటే.. ఎంత ఘన విజయమో అర్థం చేసుకోవచ్చన్నారు. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కు , తమకు మధ్య 48 లక్షల ఓట్ల తేడా ఉందన్నారు. బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతయ్యిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత తమపై ఉందన్నారు కేటీఆర్. పార్టీలో అడుగుపెట్టి 12 యేళ్లు అయిందనీ…  టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం వుందని… వందేళ్ల పాటు పార్టీ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కేటీఆర్.

“రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు బొటాబొటి సీట్లు వచ్చాయి. పరిస్థితి చూస్తుంటే దేశంలో ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఖమ్మం తప్ప.. 15 పార్లమెంట్ సీట్లలో స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. 2019లో టీఆర్ఎస్ 16సీట్లు గెలుచుకుంటే.. పోరాడి మన డిమాండ్స్ సాధించుకోవచ్చు. మూడు రోజులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలు కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు వాళ్ళు టీఆర్ఎస్ తో కలిసి వస్తామన్నారు. సీఎం కేసీఆర్ సేవలు దేశం మొత్తానికి అవసరం. కార్యకర్తలు మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. దేశమంతటా కాంగ్రెస్ 80,90స్థానాలు దాటదు. కాబట్టి టీఆర్ఎస్ 16సీట్లు సాధిస్తే మనకే నిర్ణయాధికారం వుంటుంది. ఢిల్లీ జుట్టు మన చేతిలో వుంటే మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకోవచ్చు” అన్నారు.

ఎగ్జిట్ పోల్ సర్వేలతో మేం కూడా గందరగోళంలో పడ్డాం

“చంద్రబాబును తెలంగాణ నెత్తిన రుద్దేందుకు కొన్ని మీడియా సంస్థలు చేసిన ప్రయత్నాలకు జనం బుద్ధి చెప్పారు. ఎన్నికల ముందు జరిగిన ప్రచారానికి మేం కూడా గందరగోళంలో పడ్డాం. అది వారి విజ్ఞతకు వదిలేద్దాం. వారే క్రెడిట్  కోల్పోయారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిస్తే అక్కడ ఈవీఎం టాంపరింగ్ జరగలేదు. ఇక్కడ ప్రజలు ఒడిస్తే టాంపరింగ్ అంటారు. ఎందుకు ఒడిపోయం అనేది సమీక్ష చేసుకోకుండా ఈవియం టాంపరింగ్ అనడం సిల్లీగా వుంది. ఓట్లు వేసిన ప్రజలను అవమానించినట్లు వుంది. ప్రతిపక్షం వుండకూడదని ప్రజలు డిసైడ్ చేశారు. మేం దేశం కోసం ఫ్రంట్ పెడుతున్నాం. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నామమాత్ర పార్టీగా మారుతుంది” అన్నారు.

టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తిరుగులేని రాజకీయ శక్తిగా మలచాలనేది మా ప్రయత్నం. యువతకు పెద్దపీట వేసి పార్టీని కాపాడే బాధ్యత వారికే అప్పగిస్తే బాగుంటుంది అనేది మా నిర్ణయం. తెలంగాణ కేంద్ర బిందువుగా పని చేస్తున్న పేపర్లు, టీవీలకు పెద్ద పీట వేయాలనే ఆలోచన మాలో వుంది. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చుతాం.

జనం ప్రోగ్రెస్ కోరుకున్నారు.. కాంగ్రెస్ కాదు

“లగడపాటికి రాజకీయ సన్యాసం ఇచ్చింది మేమే. ఆయన సర్వేకు కూడా సన్యాసం ఇచ్చినట్లే. ప్రజలు కోరుకున్నది ప్రోగ్రెస్ కానీ కాంగ్రెస్ కాదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే తర్వాత ఇంకేదో అవుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరో పదిహేనేళ్లు కేసీఆర్ తెలంగాణ కు సీఎంగా వుండాలని నాతో సహా మా ఎమ్మెల్యేలు అంతా కోరుకుంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో మా స్టాండ్ త్వరలోనే చూస్తారు

“నేను ప్రభుత్వంలో వుండాలో లేదో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలను కూడా మేము ఏర్పాటు చేసే ఫ్రంట్ లోకి తీసుకునే అవకాశం వుంది. ఏపీలో ఒకరిని చూసి ఒకరు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు అన్నారు. ఇప్పుడు జిందా తిలిస్మాత్.. సర్వరోగ నివారిణి అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో మా పాత్ర ఏంటో త్వరలోనే చూస్తారు. చంద్రబాబును మేము జాతీయ నేతగా చూడటం లేదు. ఆయన ప్రచారం చేసిన కూకట్ పల్లి, లింగంపల్లిలో ప్రజలు తిరస్కరించారు. ఏపీలో ప్రాంతీయ పార్టీనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. మహిళలకు టీఆర్ఎస్ లో ప్రాధాన్యత వుంటుంది. చంద్రబాబుతో మాకు గట్టు పంచాయితీ ఏమీ లేదు. జగన్, జనసేనతో కూడా మాకు పంచాయితీ లేదు.

Posted in Uncategorized

Latest Updates