ఈశా పెళ్లి ఖర్చు రూ.718 కోట్లు

ముంబయి : పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కూతురు ఈశా అంబానీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముంబయిలోని ముకేశ్‌ నివాసంలో ఇవాళ ఈశా వివాహం ఆనంద్‌ పిరమాల్‌తో జరుగుతుంది. ఈశా వివాహానికి 100 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.718 కోట్లు)ఖర్చు పెడుతున్నారట… ముకేశ్‌ అంబానీకి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ల స్థాయికి తగ్గట్టే ఈ ఖర్చు ఉంటుందని అంబానీ స్నేహితులు. ఈశా వివాహానికి ముకేశ్‌ అంబానీ నివాసమైన 27 అంతస్తుల భవనం యాంటీలియాను సర్వాంగ సుందరంగా అలంకరించారు.

వివాహానికి వచ్చే అతిథులు ఇక్కడికి రావడానికి ప్రత్యేక భద్రత చర్యలను తీసుకుంటున్నారు. పెళ్లికి వచ్చే అతిథులను ఫోన్లు తీసుకురావద్దని, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయద్దని వివాహ ఆహ్వాన పత్రికతో పాటే సమాచారం అందించారు. అయితే ఈశా పెళ్లి ఖర్చుపై వస్తున్న వార్తలు గనుక నిజమైతే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్న వారిలో వీళ్లది రెండో జంటగా నిలుస్తుంది. 37 ఏళ్ల క్రితం యువరాజు చార్లెస్‌, డయానాల వివాహానికి 110మిలియన్‌ డాలర్లు వెచ్చించారు.

Posted in Uncategorized

Latest Updates