ఈసారి జాగృతి తరఫున బతుకమ్మ జరుపం.. ఎంపీ కవిత

హైదరాబాద్ : ఈ సారి తెలంగాణ జాగృతి తరఫున బతుకమ్మ పండుగను జరపడం లేదని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. నాలుగేళ్లలో జాగృతి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విపక్షాలు చేసిన వ్యాఖ్యానాలు బాధపెట్టాయన్నారు.

ప్రభుత్వం నుండి తెలంగాణ జాగృతి సంస్థ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని కవిత చెప్పారు. భవిష్యత్ లోనూ తీసుకోము అన్నారు. తెలంగాణ సాంసృతిక వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటేలా… ప్రతి ఏడాది లాగే.. ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు ఘనంగా నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు.

Posted in Uncategorized

Latest Updates