ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బీసీ గురుకులాల్లో డిజిటల్ క్లాస్ లు

digitalబీసీ గురుకులాల్లో విద్యార్థులకు మరింత  మెరుగైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి డిజిటల్ క్లాసులు నిర్వహించనుంది. విద్యార్థులకు అవసరమైన అన్నివసతులు, సౌకర్యాలు కల్పించడంతోపాటు, విద్యాబోధనను ఎప్పటికప్పుడు మెరుగుపర్చేందుకు జిల్లాలవారీగా అధికారులతో పరిశీలన జరుపుతున్నామని తెలిపారు.. బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు.

గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా గురుకులాల్లోని విద్యార్థులు ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టిసారించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యం కలిగితే సమీపంలోని ఆరోగ్యకేంద్రాల్లో మందులు ఇప్పించడంతోపాటు… హెల్త్‌మానిటరింగ్ ద్వారా తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates