ఈ ఇయర్ నుంచే అమలు : ప్రభుత్వ స్కూల్స్ లో బయోమెట్రిక్

TS BIO METRIC STUDENTSకార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ లో మెరుగైన సధుపాయలను ఏర్పాటుచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, బాలికలకు హెల్త్ కిట్స్ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ..మరో కొత్త పనికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వపాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలుచేయాలని చూస్తోంది విద్యాశాఖ.

ఈ మేరకు ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలోని పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. ఈ విధానంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సర్వీస్ ప్రొవైడర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏయే జిల్లాల్లో.. ఎన్ని స్కూళ్లలో ప్రయోగాత్మంగా బయోమెట్రిక్‌ ను అమలు చేయాల్సి ఉంటుందన్న అంశంపై ప్రతిపాదనలు తయారుచేసి.. ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతామన్నారు. గ్రామీణప్రాంత పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నది విద్యాశాఖ.

Posted in Uncategorized

Latest Updates