ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను : కడియం

హన్మకొండ : ఈ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడం లేదన్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈ విషయంలో వస్తున్న వదంతులు, సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లను నమ్మొద్దన్నారు ఆయన. ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత చ్చారు. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదన్నారు కడియం.

జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు ఓటు వేయనని చెప్పారు శ్రీహరి. ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్‌ ఉప ముఖ్యమంత్రిని చేశారని, కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లోనే పని చేస్తానని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణిగేందుకు కృషి చేస్తానని తెలిపారు ఉప ముఖ్యమంత్రి. తన కూతురు పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కడియం. వరంగల్‌ తూర్పులో గెలవలేకనే కొండా సురేఖ పరకాలకు పోయారని విమర్శించారు కడియం.

Posted in Uncategorized

Latest Updates