ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ADB

BARA2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశముందని ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు(ADB) తెలిపింది. బ్యాంకింగ్ సంస్కరణలు, GST,  వంటి పలు నిర్ణయాలతో భారత వృద్ధిరేటు పెరిగే అవకాశమున్నట్లు తెలిపింది. ADB రిపోర్ట్… అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ  ఫిచ్‌ అంచనాలకు సారూప్యంగా ఉండగా, ఆర్‌ బీఐ(RBI) అంచనాలకు మాత్రం తక్కువగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశాలున్నాయని RBI అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా నమోదు అయ్యే అవకాశముందని,  2019-20 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 5.0శాతానికి పెరగొచ్చని ADB తెలిపింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తొలినాళ్లలో వ్యాపారాల్లో ఒడుదొడుకుల కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.6శాతంగా నమోదైన విషయం తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates