ఈ ఏడాది రాష్ట్రానికి వార్షిక రుణం 1,36,733 కోట్లు

ETELA-BANKERS-GBR2018-19 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ.1,36,733.33 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది. గురువారం తాజ్‌దక్కన్‌లో ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే స్వామినాథన్ అధ్యక్షతన జరిగిన 19వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలో  70,23,247 మంది లబ్ధిదారులకు రూ.1,36,733.33 కోట్ల రుణాలు ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయించింది. వార్షిక ప్రణాళికలో ప్రాధాన్య రంగాలకు 68 శాతం, ఇతర రంగాలకు 32శాతం రుణాల కేటాయింపు జరిగింది. వ్యవసాయరంగానికి దాదాపు రూ.58,063. 42 కోట్లు కేటాయించారు. ఇందులో పంటరుణాలకు రూ.42,494.26 కోట్లు, వ్యవసాయానికి దీర్ఘకాలిక రుణాల కింద రూ.7,743.87 కోట్లు, వ్యవసాయ అనుబంధరంగాలకు టర్మ్‌లోన్లుగా రూ.3,677.98 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,102.74 కోట్లు, వ్యవసాయ ఇతర కార్యకలాపాలకు రూ.2,044.57 కోట్లు కేటాయించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహారంగాలకు రూ.21,381.21 కోట్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.5,836.89 కోట్లు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌రంగానికి రూ.6,598.33కోట్లు, మధ్యతరగతి ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 8,945.99 కోట్లు కేటాయించారు. అదేవిధంగా విద్యారుణాలు రూ.1,798.31కోట్లు, గృహరుణాలకింద రూ. 6,011.25 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా, ఇతర ప్రాధాన్యరంగాలకు రూ.5,493.49 కోట్లు రుణాలు కేటాయించారు.

Posted in Uncategorized

Latest Updates