ఈ ఏడాది రాష్ట్రానికి 20 స్కోచ్ అవార్డులు

తెలంగాణ రాష్ట్రానికి పలు విభాగాల్లో ఈ ఏడాది 20  స్కోచ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో కానిస్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన 55వ స్కోచ్ సదస్సులో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. సిరిసిల్ల కు 5, మెప్మాకు 9, బోడుప్పల్ కి 3, సూర్యాపేట, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలకు ఒకటి చొప్పున అవార్డులు వచ్చాయి. అవార్డులను మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు అందుకున్నారు.

పారిశుధ్యం.. స్ట్రీట్ లైట్స్, సిటిజన్ సర్వీసెస్ లాంటి విభాగాల్లో రాష్ట్రానికి స్కోచ్ అవార్డుల పంట పండింది. రైతు బంధు పథకానికి గాను అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్  డిపార్ట్ మెంట్ కు ప్లాటినం అవార్డు దక్కింది. తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు ఏడు అవార్డులు దక్కాయి. మహిళా సాధికారతకు ప్లాటినం, వీధి వ్యాపారులకు ఈ వాహనాలు, లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ, EST అండ్ P పర్యవేక్షణ-చెల్లింపుల విధానం, డిజిటల్ చెల్లింపులు, ట్రాన్స్ ఫార్మింగ్ అన్ ఎంప్లాయిడ్ యూత్ టు ఆరోగ్యదూత్స్ కు గోల్డ్ అవార్డులు దక్కాయి. మెరుగైన పనితీరుకు ప్రత్యేక అవార్డు కూడా లభించింది. ఈ అవార్డులను పురపాలక శాఖ డైరెక్టర్, మెప్మా కో ఆర్డినేటర్ పద్మతో పాటు ఇతర అధికారులు అందుకున్నారు.

సిరిసిల్ల మున్సిపాలిటీలో LED స్ట్రీట్ లైట్స్., ప్రాపర్టీ ట్యాక్స్, సిటిజన్ సర్వీస్ సెంటర్, వ్యర్థాల శుద్ధికి నాలుగు అవార్డులు దక్కాయి. LED స్ట్రీట్ లైట్స్ విభాగంలో మరో ప్రత్యేక అవార్డ్ తో కలిపి సిరిసిల్లకు ఐదు అవార్డులు దక్కాయి.

మున్సిపాలిటీల్లో పౌర సేవలకు గాను మెదక్ కు 2, సూర్యాపేటకు ఒకటి.. బోడుప్పల్, పీర్జాదిగూడకు ఒక్కో అవార్డ్ దక్కాయి. ఈ అవార్డులను ఆయా మున్సిపల్ కమిషనర్లు అందుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates