ఈ ఏడాది సాధారణ వర్షపాతం : IMD

RAUSఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయని చెప్పింది ఇండియా మెట్రో లాజికల్ డిపార్ట్ మెంట్ (IMD). గడచిన రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయనీ, పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనీ చెప్పింది. తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు త్వరగానే వచ్చి, మంచి వర్షాలే కురుస్తాయని తెలిపింది.
దేశంలో ఈఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది వాతావరణశాఖ. 2018 సంవత్సరానికి గాను వాతావరణ అంచనాలను విడుదల చేసింది. ఈఏడాదిలో 97శాతం వరకు వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పింది. ఈ సంవత్సరంలో తక్కువ వర్షపాత సూచనే లేదని తేల్చింది IMD. గడిచిన రెండేళ్లలో దేశంలో మంచి వర్షాలు కురిసి, మంచి పంటలు కూడా పండాయని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు ఉండబోతున్నాయన్నారు ఐఎండీ డైరెక్టర్ జనరల్. మే చివర్లో గానీ లేదంటే జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు వస్తాయని, 45 రోజుల్లో అవి దేశమంతటా విస్తరిస్తాయని చెప్పింది.
ఈసారి లానినో బలహీనంగా ఉందనీ ఇది కూడా త్వరలోనే న్యూట్రల్ కావొచ్చని చెప్పింది. ఇక ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలో మంచి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. రుతుపవనాల వచ్చిన తరువాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం తరువాత కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. ఆదిలాబాద్, భద్రాచలంలో గరిష్ఠంగా 40 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మహబూబ్ నగర్, నిజామాబాద్ 39, హైదరాబాద్, హన్మకొండలో 38, నల్గొండలో అత్యల్పంగా 37 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. రేపు కూడా వాతవరణం కూల్ గా ఉండొచ్చని ఒకటి రెండు చోట్ల జల్లులు కురవొచ్చని చెప్పింది వాతావరణ శాఖ.

Posted in Uncategorized

Latest Updates