ఈ ఏడాది 232 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

 జమ్మూ కాశ్మీర్ లో సైన్యం సత్తా చూపుతుంది. పక్కా సమాచారంతో నక్కివున్న ఉగ్రవాదులను మట్టుబెడుతుంది. 2018 వ సంవత్సరానికి గాను 232 మంది ఉగ్రవాదులను సైన్యం హతం చేసింది. ఈ విషయాన్ని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు కచ్చితమైన సమాచారం అందించడంతో టెర్రరిస్టులకు దీటుగా భారత జవాన్లు రిప్లై ఇస్తున్నారని చెప్పారు. సైన్యంపై రాళ్లతో దాడి చేసే సంఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయని… గాయాలబారిన పడే వారి సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు. 240 మంది టెర్రరిస్టులు కశ్మీర్‌లోయలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. జూన్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు 140 మంది టెర్రరిస్టులను భారత జవాన్లు హతంచేసినట్లు అధికారి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates